జేసీకి కోలుకోలేని షాక్… వైసీపీలోకి ఊహించని నేత

జేసీకి కోలుకోలేని షాక్... వైసీపీలోకి ఊహించని నేత

0

ఏపీలో ప్రత్యక్ష రాజకీయాలకు పరిచయంలేని తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేపీ దివాకర్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది… ఎన్నో ఏళ్లుగా జేసీ కుటుంబానికి కీలక అనుచరుగా వ్యవహరిస్తున్న మైనార్టీ నేత షబ్బీర్ అలీ తాజాగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు…

పార్టీలోకి చేరేందుకు వచ్చిన ఆయనకు సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి… షబ్బీర్ అలీతో పాటు టీడీపీకి చెందిన సుమారు 500 మంది వైసీపీ తీర్థం తీసుకున్నారు…

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తాము ఆకర్షితులు అయ్యామని అన్నారు… అందుకే తాము వైసీపీ తీర్థం తీసుకున్నామని షబ్బీర్ తెలిపారు…