జేఈఈ మెయిన్ హాల్ టికెట్లు రిలీజ్..డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..

0

ఎట్టకేలకు జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్‌ మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 501 నగరాలతో పాటు ఇతర దేశాల్లో 21 నగరాల్లో పరీక్ష నిర్వహించేందుకు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) ఏర్పాట్లు చేసింది.

కొవిడ్ లక్షణాలు లేవని విద్యార్థులు స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుల డౌన్ లోడ్‌లో ఏవైనా సమస్యలు ఉంటే 011 – 40759000 ఫోన్‌ లేదా jeemain@nta.ac.in మెయిల్ ద్వారా సంప్రదించాలని ఎన్‌టీఏ తెలిపింది.

రోజూ రెండు పూటలు పరీక్ష నిర్వహిస్తారు. రెండు రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానుండగా…మరోవైపు  మంగళవారం ఉదయం వరకు అడ్మిట్ కార్డులను విడుదల చేయకపోవడంపై ఎన్టీఏ తీరుపై విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here