ఫ్లాష్- ప్రగతి భవన్ వద్ద జేసీ దివాకర్ రెడ్డి హల్‌చల్..అరెస్ట్

Jesse Divakar Reddy arrested at Pragati Bhavan

0

తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి హ‌ల్ చ‌ల్ చేశాడు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లోకి వెళ్లాల‌ని.. సీఎం కేసీఆర్ ను క‌ల‌వాల‌ని కాసేపు హంగామా చేశారు. అయితే అపాయింట్ మెంట్ లేనిది ప్ర‌గ‌తి భ‌వ‌న్ లోకి వెళ్లడానికి అనుమ‌తి ఉండ‌ద‌ని పోలీసులు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ ను లేదా మంత్రి కేటీఆర్ ను క‌లుస్తాన‌ని అక్కడే ఉన్నారు.  ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద ఉన్న పోలీసుల‌తో కూడా జేసీ దివాక‌ర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు జేసీ దివాక‌ర్ రెడ్డి అరెస్టు చేశారు. ఎప్పుడూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తు జేసీ దివాక‌ర్ రెడ్డి ఈ ఘటనతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here