డిగ్రీ అర్హతతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు..జీతం రూ.60 వేలు

0

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో జూనియర్​ కోర్టు అసిస్టెంట్ (గ్రూప్​ బీ నాన్​ గెజిటెడ్​) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ జారీ చేసింది సుప్రీం కోర్టు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 210 పోస్టులు ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైన డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

కంప్యూటర్​ ఆపరేషన్​పై అవగాహన ఉండాలి.

కంప్యూటర్​పై నిమిషానికి 35 పదాలు(ఆంగ్లం) టైపింగ్​ చేయగలగాలి.

అభ్యర్థులు 2022 జులై 1 నాటికి 18 ఏళ్లు పైబడి 30 ఏళ్ల వయసులోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఎక్స్​సర్వీస్​మెన్​, స్వాతంత్య్ర సమరయోధులపై ఆదారపడే వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

పరీక్ష విధానం ఇలా..

100 ప్రశ్నలతో ఆబ్జెక్టివ్​ తరహా రాత​ పరీక్ష ఉంటుంది. అందులో 50 జనరల్​ ఇంగ్లీష్​ ప్రశ్నలు, 25 జనరల్​ ఆప్టిట్యూడ్​, 25 జనరల్​ నాలెడ్జ్​ ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత 25 ప్రశ్నలతో కంప్యూటర్​ పరిజ్ఞానంపై ఆబ్జెక్టివ్​ పరీక్ష ఉంటుంది. దీనికి మొత్తం 2 గంటల సమయం ఉంటుంది. ఇందులో తప్పు సమాధానానికి 1/4 మార్కులు కోత విధిస్తారు.

జనరల్​, ఓబీసీ అభ్యర్థులు దరాఖస్తు రుసుము కింద రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్​సర్వీస్​మెన్​, దివ్యాంగులు రూ.250 కట్టాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు: ఆన్​లైన్​ దరఖాస్తులు 2022, జూన్​ 18 నుంచి మొదలయ్యాయి.

దరఖాస్తు చివరి తేదీ 2022, జులై 10, అర్ధరాత్రి 23.59గా నిర్ణయించారు.

ఎంపికైన వారికీ బేసిక్​ పే కింద నెలకు రూ.35,400గా ఉండగా.. ఇతర అన్ని అలవెన్సులు కలిపి మొత్తంగా రూ.63,068 వరకు వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here