పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..

Jobs with 10th class qualification..full details ..

0

రక్షణ శాఖ ఆధ్వర్యంలోని డిఫెన్స్‌ ఎస్టేట్‌ ఆర్గనైజేషన్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 97 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇందులో సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌, హిందీ టైపిస్ట్‌ పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

మొత్తం పోస్టులు: 97
ఇందులో గ్రేడ్-2 సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌ 89, జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ 7, హిందీ టైపిస్ట్‌ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌ పోస్టులకు పదో తరగతితో పాటు సర్వేయింగ్‌లో డిప్లొమా సర్టిఫికెట్‌ ఉండాలి. హిందీ టైపిస్ట్‌ పోస్టుకు పదో తరగతి పాసై నిమిషానికి 25 పదాలు టైప్‌ చేసే సామర్థ్యం ఉండాలి. జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులకు హిందీ లేదా ఇంగ్లిష్‌లో పీజీ చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా

అప్లికేషన్‌ ఫీజు: రూ.200

దరఖాస్తు విధానం: నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తును పూర్తిగా నింపి సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్‌: Principal Director, Defence Estates, Southern Command, Near ECHS Polyclinic, Kondhwa Road, Pune (Maharashtra)-411040

దరఖాస్తులకు చివరితేదీ: 2022, జనవరి 15

వెబ్‌సైట్‌: https://www.dgde.gov.in/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here