కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన వివరాలు ఎవరెవరిని కలువనున్నారో క్లుప్తంగా

కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన వివరాలు ఎవరెవరిని కలువనున్నారో క్లుప్తంగా

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కడప జిల్లా విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలకు అలాగే టీడీపీ కంచుకోట జిల్లాల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకే చంద్రబాబు నాయుడు సమీక్షలు చేస్తున్నారు.. ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన ఆయన ఈ నెల 25 నుంచి 27 వరకు కడప జిల్లాలో పర్యటించనున్నారు

అందుకు సంబంధించిన పర్యటన వివరాలు…..

25న హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి కడప ఎయిర్ పోర్టకు 11.30 గంటలకు చేరుకుంటారు… అక్కడినుంచి నేరుగా రాజంపేటకు రోడ్డుమార్గంలో చేరుకుని సమావేశంలో పాల్గొంటారు.. మధ్యాహ్నం 3 గంటలకు బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు.. రాయచోటి ప్రాంతాల్లో పర్యటిస్తారు..

26 వైసీపీ బాధిత కుంటుంబాలను పరామర్శిస్తారు… ఆరోజు 11.30 గంటలకు కడప, మైదుకూరు, పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు… 27న చక్రాయపేటకు చెందిన కర్నాటి సుబ్బారెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు.. 12 గంటలకు జైల్లోఉన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి వెంకట సుబ్బారెడ్డిని పరామర్శించనున్నారు… ఆ తర్వాత తిరిగి విజయవాడకు చేరుకుంటారు…