ఈ జిల్లాలో తమ్ముళ్లు తలోదారి పట్టారు…

ఈ జిల్లాలో తమ్ముళ్లు తలోదారి పట్టారు...

0

వైఎస్సార్ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు తలో దారి పట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు జిల్లాలో టీడీపీ ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది….

దీంతో తమ రాజకీయ దృష్ట్య ఆదినారాయణ రెడ్డి సీఎం రమేష్ వంట జిల్లా అగ్ర టీడీపీ నాయకులు బీజేపీలో చేరిపోయారు… ఇక మిగిలిన టీడీపీ నాయకులు టీడీపీకి అంటిముట్టనట్లు ఉన్నారు… ముఖ్యంగా వరదరాజులు రెడ్డి కే. విజయమ్మ వంటి వారు ఎన్నికల రిజల్స్ నాటినుంచి మౌనం పాటిస్తున్నారు…

తాజాగా సమాచారం ప్రకారం వీరు కూడా రేపో మాపో పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని జిల్లాలో టాక్… ఇక మరికొందరు పార్టీలో ఉన్నా టీడీపీ కార్యక్రమాలు తమకు పట్టవన్నట్లు వ్యవహరిస్తున్నారు… ఇక మరికొందరు అంతర్గత విభేదాలతో పార్టీకి అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.