మరోసారి కాజల్ తో రానా.. మరోసారి బొమ్మ హిట్టేనా..!!

మరోసారి కాజల్ తో రానా.. మరోసారి బొమ్మ హిట్టేనా..!!

0

కొన్ని జంటలు హిట్ పెయిర్ గా నిలిచిపోతాయి.. అలాంటి జంటల్లో ఒకటి రానా కాజల్.. వీరి కలయిక లో వచ్చిన సినిమా నేనే రాజు నేనే మంత్రి ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.. ఈ సినిమాలో రానాతో కాజల్ కెమిస్ట్రీ అదిరిందనే టాక్ అప్పట్లో బాగా పాకింది.. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మామూలు గా పేరు తెచ్చుకోలేదు..

అయితే మరోసారి వెండితెరపై కనువిందు చేయనుంది.. రానా హీరోగా ఈ సినిమాను నందినీరెడ్డి రూపొందించనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కీర్తి సురేశ్ ను సంప్రదించారు. తెలుగులో ‘మిస్ ఇండియా’ .. హిందీలో ‘మైదాన్’ సినిమాలు చేస్తున్న కారణంగా డేట్స్ లేవని ఆమె చెప్పిందట. దాంతో కాజల్ తో సంప్రదింపులు జరుగుతున్నాయి.