కళ్ల ముందే దారుణం రైలుప్రమాదం పై ప్రత్యక్ష సాక్షి సంచలన విషయాలు

కళ్ల ముందే దారుణం రైలుప్రమాదం పై ప్రత్యక్ష సాక్షి సంచలన విషయాలు

0

కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన రైళ్ల ఢీ ప్రమాదంలో ఎంఎంటీయస్ డ్రైవర్ శేఖర్ పరిస్థితి విషమంగా ఉంది. ఆయనని బయటకు తీసేందుకు అక్కడ రైల్వే సిబ్బంది ప్రయత్నిస్తున్నరు, ఈ ప్రమాదంలో ఆయన మెడకు తీవ్రగాయాలు అయ్యాయి అని తెలుస్తోంది.హంద్రీ ఎక్స్ ప్రెస్ రైలు కాచిగూడ స్టేషన్ వద్ద సిగ్నల్ కోసం ఆగి ఉంది. అయితే సిగ్నల్ లోపం వల్ల అదే ట్రాక్‌పై ఎంఎంటీఎస్ రైలు వచ్చింది. అని అధికారులు తేల్చారు. ఇక ఇక్కడ కాస్త భయం లేని విషయం ఏమిటి అంటే, ఆ ప్రమాదం జరిగింది స్టేషన్‌ కావడంతో రైలు వేగం తక్కువగా ఉందని, లేదంటే పెను ప్రమాదం సంభవించేదని అధికారులు వెల్లడించారు.

అయితే దీనిపై ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పేదాని ప్రకారం కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో హంద్రీ ఎక్స్ ప్రెస్ రైలు సిగ్నల్ కోసం ఎదురుచూస్తోందట, ఈ సమయంలో సాధారణంగా అదే ట్రాక్‌పై ఎంఎంటీఎస్ రైలు వచ్చింది ఒకే ట్రాక్ పైకి రైలు రావడంతో ముందు ఆశ్చర్యపోయారు. అయితే కొందరు పక్క నుంచి చూస్తునే ఉన్నారట. ఎదురుగా వస్తున్న రైలు చూసి కేకలు కూడా వేశారట. అయితే అందులో ప్రయాణికులకు మాత్రం ఏం జరుగుతుందో తెలియలేదు, అందులో ఉన్నవారు అందరూ కూడా భయపడి కేకలు వేశారు, మా కళ్ల ముందే అతి వేగంగా ఎం ఎం టీఎస్ ట్రైన్ ముందుకు వచ్చి ఢీ కొట్టింది అని అంటున్నారు అక్కడ వారు. అయితే ఇందులో సిగ్నల్ సరిగ్గా ఇవ్వలేదని అలాగే లోకోపైలెట్ కూడా సరిగ్గా చూసుకోకపోవడం పెను ప్రమాదానికి కారణం అయింది అని చెబుతున్నారు ప్రత్యక్ష సాక్ష్యులు.