కళ్యాణ్ రామ్ ఈజ్ బ్యాక్

కళ్యాణ్ రామ్ ఈజ్ బ్యాక్

0

యాక్షన్ హీరో కామెడీ చేయడం గొప్ప విషమే. కల్యాణ్ రామ్ యాక్షన్ హీరోగా నిరూపించుకొన్నాడు. నందమూరి హీరోల బ్రాండ్ తో తొడ గొట్టి మరీ ప్రేక్షకులని మెప్పించాడు. రొటీన్ మాస్, యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులకి బోర్ కొట్టించాడు. ఐతే, దానికి బిన్నంగా ‘పటాస్’ సినిమాతో ప్రేక్షకులకి వినోదాన్ని పంచాడు. మంచి విజయాన్ని అందుకొన్నాడు. ఆ తర్వాత మళ్లీ యాక్షన్ లోకి వెళ్లిపోయాడు. మళ్లీ అదే రిజల్ట్. ఈ మధ్య కల్యాణ్ భిన్నంగా ట్రై చేస్తున్నారు. 118లాంటి విభిన్నమైన సినిమా చేశాడు.

ఇక, కల్యాణ్ రామ్ కోసం సంపత్ నందికి ఓ మంచి కామెడీ ఎంటర్ టైనర్ ని చేయబోతున్నారు. పటాస్ తరువత కామెడీ చిత్రాలు పెద్దగా చేయని కళ్యాణ్ రామ్, సంపంత్ నంది సినిమాలో మాత్రం పక్కా కామెడీ అంశాలు హైలెట్ అయ్యే విధంగా సినిమాని చేయనున్నాడట. హీరో పాత్రను చాలా వైవిధ్యంగా మలిచారని సంపత్ నంది. ఈ సినిమా మొత్తం మీద కళ్యాణ్ రామ్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉండేలా చూసుకున్నారని తెలుస్తోంది. ఆ పాత్రలోని వేరియేషన్స్ వల్లే సినిమాలో కామెడీ సీక్వెన్స్ హైలెట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.