చంద్రబాబుకు మరో ముఖ్యనేత షాక్… త్వరలో బీజేపీలోకి

చంద్రబాబుకు మరో ముఖ్యనేత షాక్... త్వరలో బీజేపీలోకి

0

2024 ఎన్నికల నాటికల్లా ఏపీలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు మరోసారి పుంజుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే మరో వైపు తమ్ముళ్లు మాత్రం తమ రాజకీయ భవిష్యత్ ను ద్రుష్టిలో ఉంచుకుని ఇతర పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

ఇందులో జూనియర్ నాయకులతో పాటు సీనియర్ నాయకులు కూడా ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది… టీడీపీ తరపున రాజ్య సభ్యుడుగా, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించిన కంభంపాటి రామ్మోహన్ రావు త్వరలో టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే కేంద్రంలో ఉన్న బీజేపీ ఆపరేషన్ ఏపీ అన్నట్లు వ్యవహరిస్తోంది. ఈ ఆపరేషన్ లో భాగంగా టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్చుకున్న సంగతి తెలిసిందే.