కాంచన నుంచి కొత్త పోస్టర్..హిజ్రా లుక్ తో అదిరిపోయాడు..!!

కాంచన నుంచి కొత్త పోస్టర్..హిజ్రా లుక్ తో అదిరిపోయాడు..!!

0

సౌత్ లో సూపర్ హిట్ అయినా కాంచన సినిమా బాలీవుడ్ లో ‘లక్ష్మీ బాంబ్’ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా చేస్తోన్న ఈ సినిమాకి తెలుగు తమిళ సినిమా లకు దర్శకత్వం వహించినా లారెన్స్ దర్శకత్వం వహించడం విశేషం..

తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను వదిలారు. కాళికాదేవి ఆలయంలో .. ఎర్రచీరతో హిజ్రా లుక్ తో అక్షయ్ కుమార్ కనిపిస్తున్నాడు. తన కుటుంబానికి అన్యాయం చేసిన ఒక వ్యక్తిని అంతం చేసే ప్రయత్నంలో భాగంగా ‘కాంచన’లో లారెన్స్ నరసింహ స్వామి ఆలయంలోకి వెళతాడు. ఆ సన్నివేశాన్ని హిందీలో కాళికాదేవి ఆలయంలో ప్లాన్ చేసి వుంటారు. అందుకు సంబంధించిన పోస్టరే ఇది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.