కన్నా చంద్రబాబుకు టచ్ లో

కన్నా చంద్రబాబుకు టచ్ లో

0

గత కొద్దికాలంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ సర్కార్ పై నిప్పులు చేరుగుతున్నారు… ఇసుక విధానం దగ్గర నుంచి పోలీసుల తీరు వరకు కన్నా వ్యతిరేకిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు… సొమ్మొకరిది సోకు ఒకరిదన్నట్లు ఏపీ సర్కార్ తయారు అయిందని కూడా కన్నా విమర్శించారు…

కేంద్రం ఏపీకి నిధులు కేటాయిస్తే దానికి ఏపీ వైసీపీ నాయకులు పేరు మార్చుతున్నారని విమర్శలు చేస్తున్నారు… విమర్శలు చేయడంలో కన్నా ఏమాత్రం తగ్గడంలేదు… ఇటీవలే గవర్నర్ ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు…

దీంతో వైసీపీ నాయకులుకు మింగుడు పడకుందట. మీడియాను వేధికంగా చేసుకుని కన్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసీన స్క్రిప్ట్ ని చదువుతున్నారని ఆరోపిస్తున్నారు… ఇటీవలే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కన్నా కూడా చేస్తున్నారని ఈ స్క్రిఫ్ట్ టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చిందని స్క్రిఫ్ట్ కు సంబంధించిన విషయంలో కన్నా టీడీపీకి టచ్ లో ఉన్నారని వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు…