కన్నీరు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు

కన్నీరు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు

0

కష్టపడి సంపాదించుకునే దారుల్ని ప్రభుత్వం మూసేస్తే, పనిలేక ఆకలి చల్లార్చుకోడానికి కొంతమంది కూలీలు ఆలయాల్లో అన్న ప్రసాదాల మీద ఆధారపడుతున్నారంటే బాధేస్తోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన చెందారు…

ఇంకొకచోట మెతుకుకోసం చెత్తకుప్పల్లో వెతుకుతున్న కూలీని తలచుకుంటే కళ్ళు చెమర్చుతున్నాయని చంద్రబాబు నాయుడు తెలిపారు..

ప్రజలకు ఇలాంటి దయనీయ పరిస్థితులు తెచ్చినందుకు వైసీపీ పాలకులు సిగ్గుపడాలని మండిపడ్డారు…. అధికారంలోకి వచ్చిన 5నెలల్లో ఇదేనా మీరు సాధించిన ఘనకార్యం? కనీసం అన్నక్యాంటీన్ ఉన్నా ఈ పరిస్థితిలో కూలీలను ఆదుకునేదని గుర్తు చేశారు. సాకులు చెప్పకుండా వెంటనే అన్నక్యాంటీన్ లను తెరిచి పేదలను ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు…