కార్తికేయ ఈసారి ఏం చేస్తాడో.. ఎదో కొడుతుంది..!!

కార్తికేయ ఈసారి ఏం చేస్తాడో.. ఎదో కొడుతుంది..!!

0

Rx100 తో హిట్ కొట్టినా రెండవ సినిమా హిప్పీ సినిమా తో భారీ ఫ్లాప్ మూటగట్టుకున్న కార్తికేయ మూడో సినిమా నే విలన్ గా చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.. ప్రస్తుతం కార్తికేయ `90 ఎం.ఎల్‌` చిత్రం చేస్తున్నారు. ఆర్ ఎక్స్ 100్‌ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తీసిన కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అశోక్ రెడ్డి గుమ్మకొండ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. కాగా కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉదయం 10 గంటల 35 నిమిషాలకు ఈ మూవీ టీజర్‌ని విడుదల చేయనున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు: చంద్రబోస్‌, కెమెరా: జె.యువరాజ్‌, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఆర్ట్: జీఎం శేఖర్‌, ఫైట్స్: వెంకట్‌, నృత్యాలు: ప్రేమ్ రక్షిత్‌, జానీ, కో డైరక్టర్‌: సిద్ధార్థ్ రెడ్డి గూడూరి, ప్రొడక్షన్ కంట్రోలర్‌: కె.సూర్యనారాయణ, నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ, రచన – దర్శకత్వం: శేఖర్ రెడ్డి ఎర్ర.