కార్తీక పొర్ణమి నాడు ఉసిరి చెట్టు దగ్గర ఇలా పూజ చేస్తే ఎంతో పుణ్యం

కార్తీక పొర్ణమి నాడు ఉసిరి చెట్టు దగ్గర ఇలా పూజ చేస్తే ఎంతో పుణ్యం

0

కార్తీక మాసంలో ఉసిరిచెట్ల కింద వనభోజనాలు చేయడం చాలా మంచిది, ఇది ఆరోగ్యానికి మంచిది దైవ చింతనతో ఎంతోపుణ్యం కలుగుతుంది, ఇక ఈ నెలలో ఉసిరి చెట్ల దగ్గర దీపాలు పెట్టి ఆ విష్ణుమూర్తిని కొలుస్తారు అందరూ…ఉసిరి చెట్టుకి ఎనిమిది వైపులా దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలని చెబుతారు పండితులు.

అంతేకాదు ఉసిరి పత్రి తీసుకుని దానిని ఎండిపోకుండా పచ్చగా ఉన్న వాటితో విష్ణువుకి పూజ చేయాలి, ఇక ఉసిరితో చేసిన ఫలాహారం భోజనం ఏదైనా స్వామికి నైవేద్యం పెట్టి ప్రజలు తీసుకోవచ్చు, ఇలా దీపాలు వెలిగిస్తే ఇంటికి మంచిది యజమానికి విజయం వరిస్తుంది ఎక్కడకు వెళ్లినా.

ఉసిరి చెట్టు దగ్గర దీపాలు, పూజలు, ప్రదక్షిణలు, వన భోజనాలు అంటూ ఎక్కువసేపు ఉంటారు, ఇది వైద్యపరంగా చాలా మంచిది.. ఉసిరి గాలి పీల్చడం వల్ల ఎంతో మంచిది.. ఇవన్నీ కూడా పెద్దలు నాటి నుంచి పాటిస్తున్నారు.. మీరు కార్తీక పౌర్ణమి రోజున శ్రీమహావిష్ణువును పూజించి, చిత్రాన్నాలను నివేదించి ఆ స్వామికి భక్తితో పూజ చేసి అక్కడ వనభోజనాలు చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి … కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి చెట్టు నీడలో వన భోజనం చేస్తే చాలా మంచిది…కార్తీక పొర్ణమి నాడు చేసే సాలగ్రామ దానం, ఉసిరి కాయల దానం వల్ల కూడా పాపాలు నశిస్తాయి అంటున్నారు పండితులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here