మరోసారి మెగా ఫ్యామిలీ ని టార్గెట్ చేసిన కత్తి మహేష్..!!

మరోసారి మెగా ఫామిలీ ని టార్గెట్ చేసిన కత్తి మహేష్..!!

0

కత్తి మహేష్ ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది పవన్ కళ్యాణ్ తో ఆయనకు ఉన్న విభేదాలే.. ఓ సంవత్సరం పొడుగునా కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ ల మధ్య వార్ జరిగింది.. తర్వాత అది సద్దుమణిగింది.. అయితే ఛాన్స్ వచ్చినప్పుడల్లా కత్తి మహేష్ మెగా ఫామిలీ ని , పవన్ ని తిట్టి పోస్తూనే ఉంటారు.. అయితే తాజాగా ఆయన మరోసారి మెగా ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు.

మొన్న జరిగిన సైరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, సినిమాలో కాస్ట్యూమ్స్ మరియు స్టైలింగ్ విభాగంలో పని చేసిన తన డాటర్ సుస్మితను మెచ్చుకుంటూ మెగాస్టార్ పొగడడం జరిగింది. ఆ తరువాత ఆమె కూడా స్టేజిపైకి వచ్చి సైరాలో పని చేసిన తన అనుభవాలు పంచుకున్నారు.

అయితే నిజానికి ఆ సినిమాకు సుస్మిత గారితో పాటు మరొక అమ్మాయి కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిందని, అయితే మెగాస్టార్ కూడా ఆ విషయమై కేవలం తమ కుమార్తె సుస్మిత గారి గురించి మాత్రమే మాట్లాడడం సబబు కాదని కత్తి మహేష్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా సంచలన కామెంట్స్ చేసారు. ఇప్పుడిది వైరల్ అవుతుంది.. దీనిపై మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.