కీర్తి సురేష్ గర్భవతి..నెట్టింట వైరల్ అవుతున్న ఫోటో..!!

కీర్తి సురేష్ గర్భవతి..నెట్టింట వైరల్ అవుతున్న ఫోటో..!!

0

మహానటి సినిమా తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయిన హీరోయిన్ కీర్తి సురేష్.. మాములుగా అయితే పది సినిమాలు చేసిన హీరోయిన్స్ కి ఇది సాధ్యం.. అయితే ప్రస్తుతం ఆమె చేతిలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువ ఉన్నాయి.. కథానాయకుల పక్క చేసే సినిమాలక్కన్నా ఆమె సోలో సినిమా లేక్ ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది.. ఈరోజు ఆమె పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న చిత్రాల కు సంబంధించి లుక్స్ రిలీజ్ చేస్తున్నారు ఆయా చిత్ర దర్శకనిర్మాతలు..

వాటిలో యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతగా, నూతన దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీకి పెంగ్విన్ అనే టైటిల్ ని నిర్ణయించి ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు ఆ సినిమా యూనిట్ సభ్యులు. ఆ పోస్టర్ లో కీర్తి సురేష్, గర్భవతిగా ఉండడం గమనించవచ్చు, డార్క్ షేడ్ తో కీర్తి ఫేస్ కనపడి కనపకుండా ఉన్న ఆ పోస్టర్, ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఆకట్టుకునే ఒక విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి ఒక ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ పెంగ్విన్ సినిమాను, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు….!!