జగన్ పై టీడీపీ ఎంపీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

జగన్ పై టీడీపీ ఎంపీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేసినేని నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు…… సహజంగా అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తారు

కానీ అధికార పార్టీని ప్రతిపక్షాలు పొగడటం అంటే అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది… అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ మాటలే మాట్లాడారు కేసినేని… ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనుకోవడం శుభపరిణామని అన్నారు నాని…

తాజాగా ఆర్టీసీ ఉద్యోగుల ఆస్పత్రిలో రోగుల సహాయకుల కోసం ఎంపీ కేసినేని నాని కల్పించిన వసతిని ప్రారంభించారు… ఈ సందర్భంగా జగన్ పై నాని ప్రశంసలు కురిపించారు… ఇదే సభకు మంత్రి పేర్ని నానా కూడా హాజరయ్యారు… ప్రభుత్వ నిర్ణయాన్న ప్రతిపక్ష ఎంపీ ప్రశంసించడం అభినందించారు…