రాజధాని మార్పుపై జగన్ కు నాని తుగ్లక్ సలహా అధిరింది

0

ఏపీ అమరావతి తొలగింపు విషయంలో ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య అటు ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది… ఈ క్రమంలో విజయవాడ ఎంపీ కేసినేని నాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు…

జగన్ గారూ… చిన్నప్పుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం. 1328లో రాజధానిని ఢిల్లీ నుంచి మహారాష్ట్రలోని దౌలతాబాద్ కు మార్చారు. తిరిగి అక్కడి నుంచి ఢిల్లీకి మార్చారు.

ఆ తుగ్లక్ లా మీరు చరిత్ర పుటల్లోకి ఎక్కకూడదని కోరుకుంటున్నా’ అని కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జగన్ తో పాటు తుగ్లక్ ఫొటోను కూడా షేర్ చేశారు.