కిమ్ జోంగ్ ఉన్ సేఫ్, ఎక్క‌డ ఉన్నారో చెప్పిన ఉత్త‌ర‌కొరియా ప్ర‌భుత్వం

కిమ్ జోంగ్ ఉన్ సేఫ్, ఎక్క‌డ ఉన్నారో చెప్పిన ఉత్త‌ర‌కొరియా ప్ర‌భుత్వం

0

మొత్తానికి ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడి గురించి కొద్ది రోజులుగా చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది, ఆయ‌న చ‌నిపోయారు అని వార్తలు కూడా వినిపించాయి, వారం త‌ర్వాత అక్క‌డ ప‌రిస్దితులు స‌ర్దుమ‌ణిగాక‌ విష‌యం చెబుతారు అని వార్త‌లు వినిపించాయి, అయితే తాజాగా ఆ దేశం దీనిపై ప్ర‌క‌ట‌న చేసింది.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌పై వస్తున్న మరణ వార్తలను ఆయన ఖండించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని కొరియాకు చెందిన ఓ టీవీ ఛానల్‌కు ఆ దేశ ప్రభుత్వం నుంచి ఓ లిఖిత పూర్వకమైన సందేశం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆ దేశ భద్రతా సలహాదారు మూన్ జేయ్ ఇన్ తెలిపారు. ప్రస్తుతం కిమ్ ఓ రిసార్ట్‌లో విడిదిలో ఉన్నట్లు, అక్కడి నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కోవిడ్ కు సంబంధించి ఆ దేశంలో ఒక్క కేసు కూడా లేదు, కిమ్ దేశ స్దితి ఆర్ధిక వ్య‌వ‌స్ధ అన్నీ గ‌మ‌నిస్తున్నారు అని తెలిపారు…ఏప్రిల్ 13 నుంచి తూర్పు తీరానికి సమీపంలో ఉన్న ఓ రిసార్టులో కిమ్ ఉంటున్నారట‌.