క్రికెటర్ కెఎల్ రాహుల్ చిలక కొట్టుడు

0

క్రికెటర్ కెఎల్ రాహుల్ క్రికెట్ మైదానంలోనే కాదు సినిమా వార్తల్లోనే క్రేజీగా మారిన సంగతి తెలిసిందే.. బాలీవుడ్లోని కుర్ర హీరోయిన్లతో లింకుల గురించి భారీగానే వార్తలు వఛ్చిన సంగతి తెలిసిందే.. క్రికెటర్గానే కాకుండా రొమాంటిక్ వర్గా వార్తల్లో పరక శీర్షికల్లో నిలిచారు. కెఎల్ రాహుల్ లిస్టులో నిధి అగర్వాల్, సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి, హీరోయిన్ సోనమ్ బజ్వా, ఆకాంక్ష రంజన్ ఉండడం మీడియాకు ప్రత్యేక ఆకర్షణాగా మారాడు.

ఈ సందర్బంగా ప్రముఖ ఆంగ్ల దిన పత్రికకు ఇఛ్చిన ఇంటర్వ్యూలో తన అఫైర్ల గురించి వఛ్చిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు . పరువురు హీరోయినుతో ఆఫైర్ల గురించి మీ వివరణ ఏమిటనే ప్రశ్నకు పలువురితో నా రిలేషన్ షిప్ గురించి మీడియాలో వార్తలు వచ్చాయా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. మరో ప్రశ్నకు సమాధానంగా నేను సాధారణంగా పేపర్ చదవను నా గురించి ఎం వార్తలు వస్తాయో నాకు తెలియదు అన్నారు. ప్రస్తుతానికి నేను క్రికెట్ను మాత్రమే ప్రేమిస్తున్నాను. క్రికెట్ తప్ప మరోటి నాకు తెలియదు. ఒకవేళ నిజంగా ప్రేమిస్తే ముందు మీకే చెప్తాను.. ప్రస్తుతం నేను వెస్టిండీస్ పర్యటన కోసం మానసికంగా సిద్ధమవుతున్నామని అన్నారు