కోడెల ఆత్మహత్యకేసు…. చంద్రబాబు తాజా నిర్ణయం

కోడెల ఆత్మహత్యకేసు.... చంద్రబాబు తాజా నిర్ణయం

0

తెలుగుదేశం పార్టీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది… కొద్దికాలంగా శివప్రసాదరావు ఆత్మహత్యపై టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు…

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెలను మానసికంగా హింసించారని అలాగే వారి కుటుంబ సభ్యులపై కేసులు పెట్టడంతో ఆయన ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు… ఇటీవలే గవర్నర్ ను కూడా కలిసి కోడెల ఆత్మహత్యపై ఒక నివేదికను సమర్పించారు…

ఇక ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు… కేంద్ర హోం మంత్రికి మానవ హక్కుల కమిషన్ కు లోక్ సభ స్పీకర్ కు కోడెల ఆత్మహత్య విషయమై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారట.