కోడెలగారు ఏంటి మీరు చేసిన పని

కోడెలగారు ఏంటి మీరు చేసిన పని

0

ఏపీ అసెంబ్లీ కంప్యూటర్లు ఫర్నిచర్ , ఏసీల మాయంపై ఏపీ ప్రభుత్వం విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు దీనిపై స్పందించారు . తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమేవేశం లో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి అసెంబ్లీ ఫర్నిచర్ తరలిస్తుండగా.. వాటిని సర్దుబాటు చేసుకునే క్రమంలో కొంత ఫర్నిచర్ తానూ వినియోగించుకున్నట్లు ఒప్పుకున్నారు.

గతంలో అనేక సార్లు అసెంబ్లీ అధికారులకు లిఖిత పూర్వకంగా లేఖలు రాసి ఫర్నిచర్ తీసుకు వెళ్లాలలని సూచించినట్లు తెలిపారు. అయన కానీ దానికి వారినుంచి ఎలాంటి స్పందంలేదని అధికారులు వస్తే ఫర్నిచర్ అప్పగిస్తారని లేదంటే ఎంత ఖర్చు అయినదో చెబితే దాన్ని తాను చెల్లిస్తానని చెప్పుకొచ్చారు కోడెల. మొత్తానికి కోడెల అధికార బలంతో చేసిన కొన్ని అక్రమాలను ఒప్పుకున్నారని చెప్పాలి