కాజల్ అగర్వాల్ పెళ్లిలో ధరించిన లెహంగా రేటు ఎంతో తెలిస్తే మతిపోతుంది

కాజల్ అగర్వాల్ పెళ్లిలో ధరించిన లెహంగా రేటు ఎంతో తెలిస్తే మతిపోతుంది

0

సౌత్ ఇండియన్ బ్యూటీ అందాల తార చందమామ కాజల్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది, తను ఇష్టపడిన వ్యక్తిని కాజల్ వివాహం చేసుకుంది, వ్యాపారవేత్త గౌతమ్ ని ఆమె కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకుంది, అతి కొద్ది మంది మాత్రమే ఈ వివాహానికి హాజరు అయ్యారు.

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ హీరోయిన్గా అదరగొడుతూనే ఉంది. ఆమె నటించిన సినిమాలు చాలా వరకూ అన్నీ సూపర్ హిట్ అనే చెప్పాలి.తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకున్న ఆమె, పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తాను అని తెలిపింది.

అయితే ఇప్పుడు ఆమె పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఆమెకి బెస్ట్ విషెస్ అందచేస్తున్నారు అందరూ.. కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లూ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. కళ్లు జిగేల్ అనిపించేలా వీళ్లిద్దరు పెళ్లి ఫోటోలతో అదరగొట్టారు. పెళ్లిలో ఆమె ధరించిన లెహెంగా సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలిచింది.

ఈ లెహెంగాను ప్రముఖ డిజైనర్.. అనామికా ఖన్నా డిజైన్ చేసారు. 20 మంది పనివాళ్లతో దాదాపు నెలరోజులు పట్టిందని ఆమె తెలిపారు.దీనికి దాదాపు రూ. 3 లక్షల వరకు ఖర్చు అయినట్టు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here