కొరటాల చిరు సినిమాలో చరణ్ బిగ్ అగ్రిమెంట్

కొరటాల చిరు సినిమాలో చరణ్ బిగ్ అగ్రిమెంట్

0

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివతో సినిమా స్టార్ట్ చేశారు.. సైరా తర్వాత చిరు చేస్తున్న సినిమా ఇది..ఇక ఈ చిత్రంలో రామ చరణ్ కూడా నటిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకి రామ్ చరణ్ 40 రోజులు షెడ్యూల్ కు కేటాయించారట దీంతో ఆయన కచ్చితంగా షూటింగ్ లో ఉంటారు అని వార్తలు వస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ తరువాత ఆ మేరకు డేట్ లు ఇవ్వబోతున్నారు. రామ్ చరణ్ క్యారెక్టర్ ఏమిటన్నది ఇప్పటి వరకు తెలియలేదు కానీ, తొలిసారి కొరటాల ఓ ప్రయోగం చేయబోతున్నారు అని తెలుస్తోంది, అయితే చిరు యంగ్ ఏజ్ లో ఉన్న సమయంలో రామ్ చరణ్ నటిస్తారు అని తెలుస్తోంది. ఇక చిరు కొరటాల సినిమా చేయాలి అని ప్లాన్ చేసుకున్నారు తర్వాత మరే సినిమా ప్రాజెక్టుపై పెట్టేలేదు అని తెలుస్తోంది.

అయితే చెర్రీ మార్కెట్ ఎక్కువ అందుకే చెర్రీ సినిమా ఆర్ ఆర్ ఆర్ విడుదల అయిన తర్వాతే ఈ చిరు కొరటాల సినిమావిడుదల చేయాలి అని ప్లాన్ వేసుకున్నారట, ఓ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు అని తెలుస్తోంది. సో మొత్తానికి ఈ ఏడాది చెర్రీ మెగా అభిమానులకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.