భారీ చిత్రానికి నిర్మాతగా కొరటాల?

భారీ చిత్రానికి నిర్మాతగా కొరటాల?

0

కొరటాల తన తదుపరి సినిమాను చిరంజీవితో చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఆగస్టులో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ఆయన ఒక భారీ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నట్టు ఫిల్మ్ నగర్లో ఒక వార్త బలంగా వినిపిస్తోంది.

తన స్నేహితులతో కలిసి ఆయన ఈ సినిమా నిర్మించనున్నాడని అంటున్నారు. ఒక స్టార్ హీరోతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని, దర్శకుడు ఎవరనేది త్వరలోనే ప్రకటించనున్నారని అంటున్నారు. దర్శకుడిగా కొరటాలకి ఇంతవరకూ అపజయమనేది తెలియదు. ఇక నిర్మాతగా తొలి అడుగులు వేస్తోన్న కొరటాల ఎంతవరకూ సక్సెస్ అవుతాడనేది చూడాలి.