జబర్ధస్త్, బిగ్ బాస్ షోలపై కోటా శ్రీనివాసరావు కామెంట్స్ ఏమన్నారంటే

Kota Srinivasa Rao comments on jabardasth and Bigg Boss shows

0

టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు నటించిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అనే చెప్పాలి. ఇప్పటికీ ఆయన నటన కోసం సినిమాలు చూసేవారు ఎందరో ఉన్నారు. ఆయన వల్ల సూపర్ గా ఆడిన సినిమాలు లెక్క‌కు మించి ఉన్నాయి అది కోటా మార్క్ . అందరు హీరోలతో కోటా నటించారు. అంతేకాదు టాలీవుడ్ లో మూడు తరాల హీరోలతో నటించిన చరిత్ర కోటాది. ఇక సటైర్లు వేయాలన్నా ఆయన తర్వాతే ఎవరైనా.

తన మనసులో మాటను సమయం వస్తే నిర్మొహమాటంగా చెప్పేసే వ్యక్తి కోటా శ్రీనివాస‌రావు. మనసులో ఒకటి పెట్టుకుని, మరొకటి చెప్పే మనస్తత్వం కాదు ఆయనది. అందుకే ఆయన్ని అందరూ బాగా ఇష్టపడుతూ ఉంటారు. తాజాగా కోటా శ్రీనివాసరావు ప్రముఖ షోల్లో చేస్తున్న ఆర్టిస్టులపై సంచలన కామెంట్స్ చేశారు.

ఒక షూటింగ్ జరుగుతున్న సమయంలో, ఓ వ్యక్తి అక్కడ కేరవాన్ లో ఇద్దరు ఆర్టిస్ట్ ల‌కి ఒకే రూం ఇస్తే ఎట్టా అని అరుస్తున్నాడు. అప్పుడు నేను ఎవరు అని అడిగాను. వారు జబర్ధస్త్ ఆర్టిస్టులు అని చెప్పారు. అప్పుడు నేను జబర్దస్త్ గా యాక్ట్ చేస్తారేమో అనుకున్నా, ఇంతకీ వారు చేసేది జబర్దస్త్ ప్రోగ్రామ్ అని తెలిసింది. అదీ వాళ్ళ క్వాలిఫికేషన్ అని షాకింగ్ కామెంట్స్ చేశారు.

బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ, తాను ఎప్పుడూ ఆ షో చూడనని పని లేని వాళ్ళు 100 రోజులు అక్కడ ఉండడానికి వెళ్తారని, ఇక ఇంట్లో పనిలేని వారు ఇది చూస్తారని కోటా అన్నారు. దీని వల్ల ఏమైనా ఉప‌యోగం ఉందా అని ప్ర‌శ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here