కేటీఆర్ గట్టి పంచ్- ముఖ్యమంత్రి పీఠంపై కీలక వ్యాఖ్యలు

కేటీఆర్ గట్టి పంచ్- ముఖ్యమంత్రి పీఠంపై కీలక వ్యాఖ్యలు

0

ఈ మధ్య తెలంగాణలో బాగా వినిపిస్తున్న మాట మంత్రి, టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కేటీఆర్ సీఎంగా బాధ్యతలు తీసుకుంటారు అని వార్తలు వినిపించాయి.. అయితే దీనిపై టీఆర్ ఎస్ నేతలు కూడా అవును ఆయన సమర్దుడు ఆయనే మా నాయకుడు అనేలా కామెంట్లు చేశారు.. ఇక కేటీఆర్ కు పట్టాభిషేకం రెడీ అనేలా వార్తలు వినిపించాయి.. కాని తాజాగా దీనిపై మంత్రి కేటీఆర్ నేరుగా ఈ కామెంట్లకు సమాధానం ఇచ్చారు.

దీనిపై కేటీఆర్ స్పందించారు. త్వరలోనే నేను సీఎం అవుతాననేది ఊహాగానాలే.. వాస్తవం కాదు. ముఖ్యమంత్రి పదవి గురించి మీడియా వాళ్లే మంత్రులతో మాట్లాడిస్తున్నారు అని తెలిపారు. ఇక కచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ గెలుపు ఖాయం అని ఆయన అన్నారు,..కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తూ పైకి డ్రామాలు ఆడుతున్నాయన్నారు.

తెలంగాణ మొత్తంలో 25 పట్టణాల్లో కాంగ్రెస్, బీజేపీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను నిలబెట్టలేదని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. ఇవన్నీ ప్రజలు మాకు ఆశీర్వాదాలే అని తెలిపారు, బీజేపీ కావాలనే విమర్శలు చేస్తోంది అని అన్నారు ఆయన….రాష్ట్రంలో 90 మినీ ట్యాంక్బండ్లను నిర్మించామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ చుట్టూ 25 పార్కులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు రూపాయి కూడా కేంద్రం నుంచి వీటికి నిధులు తెచ్చారా అని ప్రశ్నించారు.