కంచుకోటలో అజ్ఞాతం వీడిన టీడీపీ నేత

కంచుకోటలో అజ్ఞాతం వీడిన టీడీపీ నేత

0

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో చేరిన తర్వాత ఆ పార్టీకి చెందిన చాలామంది నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే… తాజాగా వీరందరు అజ్ఞాతం వీడి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు… ఇఫ్పటికే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతం వీడి పోలీసుల ముందు లొంగిపోగా ఆయన తర్వాత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అజ్ఞాతం వీడిన సంగతి తెలిసిందే.

ఇక ఇదే క్రమంలో శ్రీకాకుళం జిల్లా ఆముదాలవల నియోకవర్గం మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తన అజ్ఞాతాన్ని వీడారు… అదే సందర్భంలో ఏదురైన మీడియాను పలకరించారు… టీడీపీ నాయకులపై కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తనపైనా వేధింపులకు పాల్పడుతోందని అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై ఆరోపిస్తున్నారు..

తనపై అక్రమ కేసులు బనాయించడంపై తనకు ఏం తెలియదని అన్నారు.. జగన్ మోహన్ రెడ్డి ఓ ఫ్యాక్షన్ లీడర్ ని అలాంటి మనస్తత్వం గల నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అంతటా ఫ్యాక్షన్ విస్తరిస్తుందని గతంలో చెప్పానని ఇప్పుడు కూడా అదే చెబుతున్నానని కూన తెలిపారు..