ఖుషి సినిమా ఆనాటి సీక్రెట్ చెప్పిన భూమిక

ఖుషి సినిమా ఆనాటి సీక్రెట్ చెప్పిన భూమిక

0

పవన్ కల్యాణ్ భూమిక సినిమాల్లో ఖుషి సినిమా ఎంత హిట్ సినిమానో తెలిసిందే… అక్కడ నుంచి ఆమె సినిమాల జోరు కూడా పెరిగింది.. సక్సెస్ లు అన్నీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి…పెళ్లి చేసుకోవడం, తిరిగి రీఎంట్రీ ఇవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. మళ్లీ ఇన్నేళ్లకు అప్పటి ఖుషి సినిమా మెమొరీస్ ను పంచుకుంది భూమిక.

అవును కెరియర్ లో ఖుషీ సినిమా మూడవది అని చెబుతోంది ఆ మూవీ టైం లో చాలా అనుభూతులు ఉన్నాయి అంటోంది సూపర్ హిట్ అయిన దీపం సీన్ గురించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టింది.గుడిలో దీపం ఆరకుండా నేను, పవన్ పట్టుకునే సీన్ , నేను ఆ సమయంలో చాలా తక్కువ మేకప్ వేసుకుని వెళ్లాను.

నిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ కు ఆ మేకప్ కూడా ఎక్కువైంది. వెళ్లి ముఖం కడుక్కొని రమ్మన్నారు. నేను ఒప్పుకోలేదు. ఆయనే ఫేస్ వాష్ తెప్పించి మరీ దగ్గరుండి ముఖం కడుక్కోమని చెప్పారు. ఆ సీన్ లో అస్సలు మేకప్ లేకుండా నటించాను. ఇప్పటికీ నా ఫేవరెట్ సీన్ అదే. అద్భుతంగా వచ్చింది. ఖుషి సినిమాలో చాలా వరకూ మేకప్ వేసుకోకుండా నటించాను అని చెబుతోంది.