లోకేశ్ ను ఘోరంగా తిట్టిన లక్ష్మీపార్వతి

లోకేశ్ ను ఘోరంగా తిట్టిన లక్ష్మీపార్వతి

0

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ పై తెలుగు అకాడమి చైర్మన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు… తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… గతంలో పార్టీ తరపున తనకు ఒక్క పదవి కూడా రాకుండా చేశారని అన్నారు…

మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకి ఇప్పుడు లోకేశ్ వచ్చారని ఆమె ఆరోపించారు… ఈ కుక్కమూతి పిందెలుకు ఏం తెలుసని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు… లోకేశ్ వంటి అయోగ్యూడిని పార్టీపై చంద్రబాబు నాయుడు బలవంతంగా రుద్దుతున్నారని ఆమె ఆరోపించారు…

ఈ విషయమై టీడీపీలో లోలోపల చాలామంది ఎన్టీఆర్ అభిమానులు బాధపడుతున్నారని ఆమె అన్నారు… జగన్ మోహన్ రెడ్డి తాను ఏ పదవి కావాలంటే ఆ పదవి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు… తాను కోరుకోవాలే కానీ జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చేవాడని అన్నారు… అయితే తనకు తెలుగు బాష సంస్కృతి సాహిత్యం అంటే చాలా ఇష్టం అని అందుకే తెలుగు అకాడమి పదవి తీసుకున్నానని అన్నారు…