తృటిలో తప్పిన భారీ అగ్ని ప్రమాదం..

0

హైదరాబాద్‌ నగర శివార్లలోని శంషాబాద్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారే మంటలు భారీగా ఎగిసిపడిన ఘటన  శంషాబాద్‌ పరిధిలోని రామాంజపూర్‌లో ఉన్న టింబర్‌ కంపెనీలో చోటుచేసుకుంది. ఈ మంటలు క్రమక్రమంగా వ్యాప్తి చెందుతూ..చుట్టూ ఉన్న పరిసరప్రాంతాలకు విస్తరించి పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.

దాంతో ఈ సమాచారాన్ని స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయడంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం చేకూరలేదని అధికారులు వెల్లడించారు. విద్యుదాఘాతంతోనే టింబర్‌ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here