కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చేరికలు..రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

0

ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ తో భేటీ అనంతరం టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జూలై 7 నాటికి పిసిసి అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తవుతుందని తెలియజేశారు.

ఈ ఏడాది కాలంలో తాను చేపట్టిన కార్యక్రమాలను కేసీ వేణుగోపాల్ కి వివరించానని వెల్లడించారు.” రాబోయే కాలంలో పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి. చేరికలపై అనూహ్యంగా ముందుకు వెళ్తున్నాం. ఆ జిల్లాలో ఉన్న పరిస్థితులను బట్టి పార్టీలో చేర్చుకుంటున్నాం అన్నారు.

కాగా టీపీసీసీ అధ్యక్షుడిగా చేపట్టిన తరువాత రేవంత్ దూకుడు పెంచారు. సమయం దొరికినప్పుడల్లా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఫైర్ అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here