కుల వివాదంలో చిక్కుకున్న లావణ్య త్రిపాటి

కుల వివాదంలో చిక్కుకున్న లావణ్య త్రిపాటి

0

టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి కుల వివాదంలో చిక్కుకుంది. అసలే అవకాశాలు లేని సమయంలో ఏంటి అని ఆమెకు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా..

రాజస్థాన్ లోని కోట ప్రాంతంలో అఖిల బ్రాహ్మణ మహాసభను ఏర్పాటు చేశారు. ఈ సభకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడి ఫోటోలను షేర్ చేస్తూ “సమాజంలో బ్రాహ్మణులకు ఉన్నత స్థానం ఉంది. బ్రాహ్మణుల త్యాగం వల్లే ఈ రోజు ఈ సభ ఏర్పాటైంది. అందుకే బ్రాహ్మణ సంఘం అందరికీ మార్గదర్శకంగా నిలుస్తోంది” అని క్యాప్షన్ పెట్టాడు. ఈ ట్వీట్ పై నటి లావణ్య స్పందిస్తూ “బ్రాహ్మణ అమ్మాయి గా ఈ కులం వారికి సమాజంలో ఎందుకింత ఉందో నాకు అర్థం కావడం లేదు మనం చేసే పనులు మన స్థాయిని తెలియజేస్తాయి. కానీ కులం కాదు” అని రీట్వీట్ చేసింది.

అయితే ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఆమె దాన్ని తొలగించింది. కానీ అప్పటికే ఆ ట్వీట్ వైరల్ అయ్యింది. ప్రస్తుతం లావణ్య ట్వీట్ గురించి అంతా చర్చించుకుంటున్నారు.అయితే లావణ్య అభిమానులు మాత్రం లేనిపోని వివాదంలో చిక్కుకొవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.