లారెన్స్ ట్రస్ట్ పేరు చెప్పి దారుణ మోసం..!

లారెన్స్ ట్రస్ట్ పేరు చెప్పి దారుణ మోసం..!

0

తన కుమార్తె మెడిసిన్ సీటు కోసం ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి లారెన్స్ ట్రస్ట్ పేరు చెప్పగానే రూపాయలు 18 లక్షల సమర్పించుకున్నాడు పోలీసుల వివరాల ప్రకారం తమిళనాడులోని రామనాథపురం చిన్న కడై ఏరియా లో ఉండే ఆల్ అమీన్ పత్తున్ నిషాల కూతురు నీట్ పరీక్ష రాయగా తక్కువ మార్కులు వచ్చాయి. ఏదో చోట తమ కుమార్తెకు సీటు వస్తుందన్న ఆశతో వారు ఉన్నారు.

బస్ టికెట్లను కొనేందుకు పతున్ నిషా వెళ్ళిన టైంలో లో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి తను రాఘవ లారెన్స్ ట్రస్ట్ కు ఉపాధ్యక్షుడు నని, ట్రస్టు ద్వారా ఊర్లోని వైద్య కళాశాలలో తక్కువ డబ్బులకు సీటు వస్తుందని కాకపోతే కొంత ఖర్చు అవుతుంది అన్నాడు. ప్రవీణ్ మాటలు నమ్మిన ఆల్ అమీన్, మొదటిసారి 4.5 లక్షల రూపాయలు తరువాత అడిగినప్పుడల్లా కొంచెం కొంచెం గా మొత్తం 18 లక్షలు సమర్పించాడు.

ఇంత జరిగిన ప్రవీణ్ నుంచి సీటు గురించి సరైన సమాచారం లేకపోవడంతో. మోసపోయామని గ్రహించిన కాల్ నవీన్, పతూన్ లు రామనాథపురం జిల్లా ఎస్పీ ఓం ప్రకాష్ మీనాక్షికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న ప్రవీణ్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.