వైసీపీలో బావ వర్సెస్ బావమరిది… జగన్ సందేశం ఇదే

వైసీపీలో బావ వర్సెస్ బావమరిది... జగన్ సందేశం ఇదే

0

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఫట్టుమని నాలుగు నెలలు గడువక ముందే ఆ పార్టీలో అంతర్గత విభేదాలు గ్రూప్ రాజకీయాలు చేస్తూ రచ్చకెక్కుతున్నాయి… రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలు ఉంటే ఈ 13 జిల్లాల్లో వైసీపీ నాయకులు గ్రూప్ రాజకీయాలు చేసుకుంటున్నారు.

తాజాగా నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న గ్రూప్ రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది… జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్ రెడ్డి మరో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిల మధ్య ఎప్పటినుంచో గ్రూప్ రాజకీయాలు సాగుతున్నాయి… కానీ ఇంతవరకు ఎందుకు గ్రూప్ రాజకీయాలో చేసుకుంటున్నారో తెలియదు.

ఇటీవలే ఎంపీడీవో సరళ కోటంరెడ్డి ఫిర్యాదుతో గ్రూప్ రాజకీయాలు భహిర్గతం అయ్యాయి.. ఇక ఈ వ్యవహారంపై జగన్ సీరియస్ అయ్యారు… వీరిద్దరి సీరియస్ వార్నింగ్ ఇస్తూ ఈ భాద్యతలను వైవీ సుబ్బారెడ్డికి సజ్జల రామకృష్ణకు అప్పజెప్పారు..