వారందరూ టీడీపీ కోవర్టులేనా…

వారందరూ టీడీపీ కోవర్టులేనా...

0

2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ నేతలు ఇటీవలే తమ రాజకీయ భవిషత్ రిత్య ఇతర పార్టీల్లో చేరుతున్నారు. అయితే వీరిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా బీజేపీలోకి పంపుతున్నారా అంటే అవుననే అంటున్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీ. రామచంద్రయ్య…

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు ప్రజా ప్రతినిధులను బీజేపీలోకి పంపి అవే గొప్ప రాజకీయాలని భావిస్తున్నారని అన్నారు…

టీడీపీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన వారందరు టీడీపీ కోవర్టులే అని అన్నారు… అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే సర్కార్ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు…