లేగదూడ కోసం తల్లి ఆవు ఎంత దారుణం చేసిందో తెలిస్తే షాక్

లేగదూడ కోసం తల్లి ఆవు ఎంత దారుణం చేసిందో తెలిస్తే షాక్

0

కన్నతల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలిసిందే.. తన ప్రాణాలు అడ్డు వేసి అయినా పిల్లల ప్రాణాలు కాపాడుతుంది తల్లి,. కృష్ణాజిల్లా మచిలీపట్నం బస్టాండ్ దగ్గర ఆవు ఓ వ్యక్తిపై దాడికి ప్రయత్నించింది. దీనికి కారణం కూడా ఉంది ఆ వ్యక్తి 15 రోజుల క్రితం ఓ లేగ దూడ చనిపోతే దానిని పూడ్చేందుకు రిక్షాలో తీసుకువెళ్లాడు.. ఈ సమయంలో తల్లి ఆవు అతనిని చూసింది. అయితే అప్పటి నుంచి అది ఆ రిక్షాని మర్చిపోలేదు ఆ వ్యక్తి మళ్లీ 15 రోజులకి అటు వైపు వెళుతున్న సమయంలో అతనిపై దాడి చేసింది.

అసలు పాములు పగ పడతాయి అని తెలుసు కాని, ఆవు కూడా ఇలాంటి పగ పడుతుందా అని అందరూ ఆశ్చర్యపోయారు, అయితే ఆవులు

గేదెలు తమ యజమానులని ఎలా గుర్తుపడతాయో తెలిసిందే. ఎంత దూరంలో ఉన్నా తమ యజమాని ఇంటిని గుర్తుపడతాయి.. అతనిని వదిలి ఎక్కడికి వెళ్లవు అలాగే ఇది జరిగింది అంటున్నారు వైద్యులు,

ఆ రిక్షాని గుర్తు ఉంచుకుని ఆవు దాడి చేసింది అని చెబుతున్నారు. మొత్తానికి ఇలా ఆవు పగ తీర్చుకోవడానికి అతనిపై దూసుకురావడంతో రిక్షా వదిలి అతను పారిపోయాడు, అయితే సైకాలజీగా తమ నుంచి బిడ్డని దూరం చేస్తే చివరగా ఎవరు తీసుకువెళ్లారో వారిని గుర్తు పడతాయి అని చెబుతున్నారు వైద్యులు, అతనిపై దాడి చేస్తున్న సమయంలో దానిని తాడులతో బంధించారు. అతను అక్కడ నుంచి వెళ్లిపోయాక ఆవు శాంతించిందట బ్రతుకుజీవుడా అని వెళ్లిపోయాడు. ఇలాంటివి కోతులు కుక్కల విషయాలలో కూడా జరుగుతాయి అని చెబుతున్నారు వైద్యులు. అందుకే అవి లేని సమయంలో వాటి పిల్లలు చనిపోతే పూడ్చాలి అని చెబుతున్నారు.