లాక్ డౌన్ సడలింపు ప్రాంతాల్లో ఏ పని చేయాలో ఏ పని చేయకుడదో క్లుప్తంగా మీకోసం

లాక్ డౌన్ సడలింపు ప్రాంతాల్లో ఏ పని చేయాలో ఏ పని చేయకుడదో క్లుప్తంగా మీకోసం

0

కరోనా వైరస్ కొన్ని జిల్లాల్లో నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే… అటువంటి జిల్లాను రెడ్ జోన్ గా గుర్తించారు అధికారులు… అలాగే కరోనా ప్రభావం అతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈరోజు నుంచి కొన్ని సడలింపులను చేసింది… లాక్ డౌన్ సడలిస్తున్న ప్రాంతాల్లో ఏపని చేస్తాయి ఏ పని చయవు అనేటివి ఇప్పుడు చూద్దాం..

పని చేసేవి:
ఆర్బీఐ, బ్యాంకులు, సెబీ, ఇన్స్యూరెన్స్ కంపెనీలు.
సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి… జాతీయ గ్రామీణ ఉపాధి పనులు.
నీరు, శానిటేషన్, వేస్ట్ మేనేజ్ మెంట్, పవర్ రంగాలు.
సరుకుల లోడింగ్, అన్ లోడింగ్ పనులు (రాష్ట్ర, అంతర్రాష్ట్ర).
ఆన్ లైన్ టీచింగ్, డిస్టెన్స్ లెర్నింగ్.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డీటీహెచ్, కేబుల్ సర్వీసులు.
ప్రభుత్వ కార్యకలాపాల కోసం పని చేసే డేటా సెంటర్లు, కాల్ సెంటర్లు. మెడికల్, ఎమర్జెన్సీ స్టాఫ్ కోసం హోటల్స్, లాడ్జిలు.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలు. ఫుడ్ ప్రాసెసింగ్, ఔషధాలు, మెడికల్ ఎక్విప్ మెంట్ కంపెనీలు.
గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులు.
కార్మికులు అదనంగా అవసరం లేని, గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణ పనులు (రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు).
మెడికల్, వెటర్నరీ కేర్ సామగ్రిని తీసుకెళ్లే ప్రైవేట్ వాహనాలు.
కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల కార్యాలయాలు.
బాలురు, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల వసతి గృహాలు.

అనుమతించనివి:
రైలు, రోడ్డు, విమాన ప్రయాణాలు.
ఈకామర్స్ కంపెనీలు సరఫరా చేసే అత్యవసరం కాని వస్తువులు.
విద్యాలయాలు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్.
పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు.
ఆతిథ్య రంగం.
సినిమా థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్సులు.
రాజకీయ, సామాజిక కార్యకలాపాలు.
మతపరమైన కార్యక్రమాలు.
ఒక్క రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లేందుకు వలస కార్మికులకు అనుమతి నిరాకరణ.