లాక్ డౌన్ సమయంలో జేసీ బ్రదర్స్ కు బిగ్ షాక్…

లాక్ డౌన్ సమయంలో జేసీ బ్రదర్స్ కు బిగ్ షాక్...

0

లాక్ డౌన్ సమయంలో తాడిపత్రి జేసీ బ్రదర్స్ కు మరో బిగ్ షాక్ తగిలింది… తాజాగా జేసీ అనుచరుడు ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు… తాడిపత్రి పట్టణంలో అంబేత్కర్ నగర్ లో నివాసముంటున్న జేసీ వర్గీయుడు తిరుపాల్ రెడ్డి ఇంటి బయట కుర్చుండగా ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేసి అతన్ని గాయపరిచారు…

ఈ దాడిలో అతని భార్య పిల్లలు కూడా గాయాలపాలు అయ్యారు… ఇక విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అక్కడికి చేరుకుని దాడికి సంబధించిన వివరాలను తెలుసుకున్నారు… ఆతర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఇది తిరుపాల్ రెడ్డిని టార్గెట్ చేసినట్లు కాదని నలభై ఏళ్ల చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు…

దీనిపై పోలీసులు ఖచ్చితమైన విచారణ చేయకపోతే భవిష్యత్ లో జరగబోయే పాపాలన్నిటికి పోలీసులే కారణం అవుతారని అన్నారు… కానీ పోలీసులకు ఏ పాపంఎరుగరని పట్టణ సీఐ తేజమూర్తితో జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు….