జగన్ పై లోకేశ్ పంచ్

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైకోయిజం గురించి ప్రతీ అమ్మకి, ప్రతీ అక్కకి, ప్రతీ చెల్లికి చెప్పండని లోకేశ్ అన్నారు.. ప్రస్తుతం జగన్ సైకోయిజం పీక్స్ కి చేరుకుందని లోకేశ్ ఎద్దేవా చేశారు…

ఆఖరికి ఒంటరి మహిళని కూడా వైసీపీ రౌడీలు వదలడం లేదని ఆరోపించారు. ఇటీవలే టీడీపీ కార్యకర్తల ఇళ్లకి అడ్డంగా గోడలు కట్టారని అయితే ఇప్పుడు ఏకంగా మహిళలపై దౌర్జన్యానికి దిగుతున్నారని ఆయన మండిపడ్డారు…

తాజాగా ప్రకాశం జిల్లా, తిమ్మారెడ్డిపాలెంలో ఆదిలక్ష్మమ్మ ఇంటి ముందు కట్టిన గోడను చూస్తేనే జగన్ కి మహిళల పట్ల ఉన్న గౌరవం ఏంటో అర్థం అవుతుందని అన్నారు. వైసీపీ గోడలతో ఇళ్ల నుండి బయటకు రాకుండా చెయ్యగలరేమో, కానీ ప్రజల్లో మీ చెత్త ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను ఆపలేరని అన్నారు