జగన్ గారు ఇదొక్క సాహాయం చేయండి లోకేశ్

జగన్ గారు ఇదొక్క సాహాయం చేయండి లోకేశ్

0

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నారా లోకేశ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు… కొద్దికాలంగా లోకేశ్ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే..

ఇదే క్రమంలో మరోసారి ఆయన జగన్ ప్రశ్నించారు… 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులు స్మశానాలను ఎలాగో వదలకున్నారు కనీసం జాతీయ జెండాను అయినా గౌరవించండని లోకేశ్ రిక్వెస్ట్ చేశారు… అందుకు సంబంధించిన వీడియోను కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు…

వైసీపీ నేతల దేశభక్తి, మన జాతీయపతాకం పట్ల ఉన్న గౌరవం. ఇంత నిస్సిగ్గుగా జాతీయ పతాకానికి కూడా వైకాపా పార్టీ రంగులు వేస్తున్నారంటే, రేపు జాతీయపతాకం స్థానంలో వైసీపీ జెండాని ఎగరేస్తారేమో! స్మశానాలను ఎలాగూ వదలడం లేదు, కనీసం జాతీయ జెండాని అయినా గౌరవించండని అన్నారు.