లోకేశ్ బాధతో ట్వీట్

లోకేశ్ బాధతో ట్వీట్

0

తెలుగుదేశం పార్టీ హయాంలో ఉపాధిహామీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండేదని లోకేశ్ గుర్తు చేశారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి 6 నెలలపాలనలో ఆ స్థానాన్ని పోగొట్టుకున్నామని లోకేశ్ బాధపడ్డారు…

పైగా కేంద్రం విడుదల చేసిన ఉపాధి హామీ నిధులను పక్కదారి పట్టించి గ్రామాల అభివృద్ధిని వైసీపీ సర్కార్ దెబ్బతీసిందని లోకేశ్ మండపడ్డారు..

అంతేకాకుండా ఉపాధి హామీ వేతనదారులకు సమయానికి వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు… అందుకే ప్రభుత్వ తీరుకి నిరసనగా అసెంబ్లీ ఎదురుగా ఆందోళన చేపట్టామని లోకేశ్ తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఉపాధిహామీ నిధులు విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు లోకేశ్..