జగన్ కు లోకేశ్ చురకలు

జగన్ కు లోకేశ్ చురకలు

0

మాజీ మంత్రి నారాలోకేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి నిప్పులు చెరిగారు… జగన్ పాలన తుగ్లక్ పాలన అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు లోకేశ్. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేశారు… అందుకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు లోకేశ్..

చేతకాని వాళ్ళకు నోరు ఎక్కువ అంటారు కదా జగన్ మోహన్ రెడ్డి గారూ! మీరు చేస్తోన్న తుగ్లక్ పనులను ఎలా సమర్థించుకోవాలో తెలీక, మీ పార్టీ అధికార ప్రతినిధులు ఎలా అసహనానికి గురవుతున్నారో చూడండని విమర్శించారు..

ప్రజలు చూస్తున్నారన్న స్పృహ లేకుండా ఎలా మాటలు తూలుతున్నారో చూసి గర్వపడతారో, సిగ్గుపడతారో మీ ఇష్టం ని లోకేశ్ ట్వీట్ చేశారు.