జగన్… సీఎం అని చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా లేదా… లోకేశ్ ఫైర్

జగన్... సీఎం అని చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా లేదా... లోకేశ్ ఫైర్

0

ఏపీ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నారా లోకేశ్ అన్నారు… గతంలో వైసీపీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దోమల నివారణకు అంత ఖర్చా అని ఏడ్చారని తెలిపారు..

మరి ఇప్పుడు మీ తుగ్లక్ నిర్ణయాలకు ప్రజలు బలైపోతున్నారని లోకేశ్ మండిపడ్డారు… . రాష్ట్రంలో విష జ్వరాలు వ్యాప్తి చెంది ప్రజలు చనిపోతున్నా మీలో చలనం రాకుందని ఆయన ఆరోపించారు… .

ఇటీవలే మండపేటలో శ్రీ నవ్య డెంగ్యూ తో చనిపోయారు. ఆ బాధతో ఆమె భర్త చందు,కూతురు యోషిత ఆత్మహత్యకి పాల్పడిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని లోకేశ్ అన్నారు. ఈ దున్నపోతు ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలని లోకేశ్ ప్రశ్నించారు..