లోకేశ్ మంగళగిరికి టాటా…

లోకేశ్ మంగళగిరికి టాటా...

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేశ్ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ప్లేస్ మార్చే ఆలోచనలో ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సోషల్ మీడియాలో…

గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేశ్ ఘోరంగా ఓటమి చెందారు… అమరావతిని అన్ని విధాలుగా అభివృద్ది చేశామని గొప్పగా చెప్పుకుంటూ వచ్చిన టీడీపీ అధిష్టానం ఆ ప్రాంతంలోనే లోకేశ్ ఓటమి చెందటం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరిని ఆశ్చర్యానికి గురిచేసింది…. ప్రస్తుతం మంగళగిరిలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది వైసీపీ…

ఇక్కడ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్యే రామ కృష్టా రెడ్డి అందుబాటులో ఉంటారు… రానున్న రోజుల్లో వైసీపీ దూకుడు మరింత పేరుగుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు లోకేశ్ కు మంగళగిరి సేఫ్ జోన్ కాదని భావించి ఆయనను కుప్పంకు సిఫ్ట్ చేసే పనిలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

కుప్పం అయితే లోకేష్ కు సెఫ్ ప్లేస్ అని అంటున్నారట… ఇటీవలే చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించినప్పుడు ఇదే విషయాన్ని ఆయన అత్యంత సన్నిహితులు చెప్పారని వార్తలు వస్తున్నాయి….