టీడీపీ రహస్యాన్ని బయట పెట్టిన లోకేశ్

టీడీపీ రహస్యాన్ని బయట పెట్టిన లోకేశ్

0

తెలుగుదేశం పార్టీ జెండాను తమ భుజాలపై మోస్తూ, కుటుంబ సౌఖ్యాలను కూడా పక్కన పెట్టి అన్ని వేళలా పార్టీని కంటి రెప్పలా కాపాడుతున్నారని లోకేశ్ అన్నారు… దాదాపు 60 లక్షల మంది కార్యకర్తలే టీడీపీకు బలం, ధైర్యం, సైన్యం. పార్టీకి వెన్నెముకలాంటి కార్యకర్తల కోసం ఎంత చేసినా తక్కువే అని లోకేశ్ అన్నారు…

అలాంటి కార్యకర్త ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఏమిటి అన్న ఆలోచనతో తెచ్చిందే ‘కార్యకర్తలకు రూ.2 లక్షల ప్రమాదబీమా పథకం’. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే కార్యకర్తల కోసం ఇలాంటి పథకాన్ని ఏ రాజకీయ పార్టీ తీసుకురాలేదని లోకేశ్ గుర్తు చేశారు…

ఇలాంటి ఒక పథకాన్ని పెట్టడమే కాకుండా ఎంతో చిత్తశుద్ధితో, సమర్థవంతంగా అమలుచేస్తున్న పార్టీ కూడా టీడీపీనే అని అన్నారు. గత ఐదేళ్ళలో ప్రమాదాల్లో మరణించిన 4000 మంది టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు రూ.80 కోట్లను బీమా పరిహారంగా చెల్లించామని అన్నారు..