లోకేశ్ సంచలన కామెంట్స్

లోకేశ్ సంచలన కామెంట్స్

0

ప్రజల్లో ప్రజా రాజధాని నిర్మాణ కాంక్ష బలంగా ఉందని చెప్పడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా అమరావతి పర్యటన చేశారని లోకేశ్ అన్నారు… ఈ పర్యటనకు పెద్ద సంఖ్యలో ప్రజా స్పందన వచ్చిందని అన్నారు…

ఇంతటి స్పందన వస్తుందని తెలిసే వైసీపీ వాళ్ళు ఇతర పట్టణాల నుంచి పెయిడ్ ఆర్టిస్టులను తెప్పించి చంద్రబాబు నాయుడు కాన్వాయి పై దాడులు చేయించారని లోకేశ్ ఆరోపించారు…దాడులపై స్పందించిన డీజీపీ భావప్రకటనా స్వేఛ్చ, నిరసన తెలిపే హక్కులకు కొత్త నిర్వచనాలిచ్చారని అన్నారు.

ప్రభుత్వ కుట్రలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రజలకు ఇప్పుడు బాగా అర్థమయ్యిందని లోకేశ్ తెలిపారు ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు పర్యటనతో అమరావతి కాంక్ష మళ్ళీ ఊపిరిపోసుకుందని లోకేశ్ అశాభావం వ్యక్తం చేశారు…