లోకేష్ తో మరో నాయకుడికి విభేదాలు పార్టీకి గుడ్ బై

లోకేష్ తో మరో నాయకుడికి విభేదాలు పార్టీకి గుడ్ బై

0

తెలుగుదేశం పార్టీ నుంచి మరో కీలక నేత ఆపార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని తెలుస్తోంది.. అయితే ఈ వార్తల సారాంశంలో ముఖ్యంగా అతను గంటా వర్గం అని తెలుస్తోంది.. చంద్రబాబుతో సయోధ్యగా ఉన్నాలోకేష్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలు లేవట, విశాఖ జిల్లాలో ఆ నాయకుడికి చెక్ పెట్టాలని లోకేష్ చూస్తున్నారట.. పార్టీ లో తనకు వెన్నుపొడి పొడిచిన వారితో చినబాబు మంచి సన్నిహితంగా ఉంటారు అని అంటున్నాడు సదరు నేత . అయితే లోకేష్ పార్టీలో కావాలనే ఎదురు లేకుండా తన వర్గం పెంచుకూంటూ పోతున్నారు అని తాజాగా వార్తలు వస్తున్నాయి.

ఈ సమయంలో పార్టీని వదిలి వెళ్లిన వంశీ ఇలాంటి కామెంట్లు చేశారు, తాజాగా మరో నాయకుడు కూడా ఇప్పుడు వైసీపీలో చేరాలి అని చూస్తున్నాడట … కేవలం లోకేష్ తనకు పాజిటీవ్ గా కేడర్ ని బిల్డ్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ సమయంల మనల్ని పార్టీలో ఎదగనివ్వడు అని ఆ నేత భావిస్తున్నారట. త్వరలో ఆయన కూడా జిల్లా మంత్రి ద్వారా సీఎం ని కలుస్తారట.. దీంతో టీడీపీకి మరో వికెట్ త్వరలో పడుతుంది అని జిల్లాలో చర్చిస్తున్నారు.. అయితే బాబు మాత్రం సదరు నాయకుడిని పార్టీ మారకుండా బుజ్జగించాలి అని చూస్తున్నారట.